ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా చీకటి మానవేంద్రరాయ్, మఠం వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సీ.ప్రవీణ్‌కుమార్ వారి చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...హైకోర్టు న్యాయమూర్తులుగా మానవేంద్రరాయ్, వెంకటరమణతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్