ఆంధ్రప్రదేశ్‌

5 నగరాలకు 350 ఎలక్ట్రికల్ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రికల్ బస్సులను త్వరలో నడుపనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్‌లోకి గురువారం ఆయన లాంఛనంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కార్యక్రమం చురుగ్గా జరుతోందని, విలీనం తరువాత ఆర్టీసీ ఏ రూపంలో ఉండాలనే దానిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కమిటీని నియమించామన్నారు. 744 కోట్ల రూపాయలతో విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడ నగరాల్లో తొలి విడతగా 350 ఎలక్ట్రికల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. దీని వల్ల డీజిల్ భారం తగ్గుతుందన్నారు. ఒక్కో బస్‌ను 2.18 కోట్లతో కొనుగోలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 187.5 కోట్ల రూపాయల మేర సాయం కోరుతూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఎల్‌ఎల్‌ఆర్‌ల జారీలో చోటు చేసుకుంటున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. కొంతమంది కంప్యూటర్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన దాని కన్నా ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అవినీతికి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో కంప్యూటర్ కేంద్రాలు సహా మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పించిందన్నారు. జూలై 1 నుంచి ఎంవీఐ కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాహనాల కొనుగోలు సమయంలో విక్రయదారులు, డీలర్ల వద్దే తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం సందన్నారు. దీనిని డీలర్లు ఆదాయ వనరుగా భావించి, వాహన కమిషన్‌తో పాటు లైఫ్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారన్నారు. కొంతమంది డీలర్లు ఎక్కువ ధరకు వాహనాలు విక్రయించి, ఆన్‌లైన్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లుగా నమోదు చేసి లైఫ్ ట్యాక్స్‌ను తగ్గించి చూపుతున్నారన్నారు. ఆన్‌లైన్లో నమోదు చేయకుండానే కొంతమంది వాహనాలు విక్రయించడం వల్ల ఆర్టీఏ అధికారులకు తెలియకుండానే వాహనాలు రోడ్డు ఎక్కుతున్నాయన్నారు. ఇటువంటి అక్రమాలకు తెరదించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ఆన్‌లైన్లోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 24 గంటల్లో ఇందుకు అనుమతి మంజూరు చేయకుంటే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల రాయితీ బస్‌పాస్‌ల రెన్యూవల్ గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతున్నామన్నారు. దీని వల్ల 2.5 లక్షల మంది దివ్యాంగులకు మేలు కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ లేని పాఠశాల, కళాశాలల బస్సులను 357 సీజ్ చేశామన్నారు. రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల బస్సులు 10,500 ఉన్నాయన్నారు. దాడుల కారణంగా గత వారం రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు 5000కు పైగా ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లను పొందాయన్నారు. రవాణా శాఖలో 554 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
వేలాది మంది జర్నలిస్టులు పలు సంస్థల్లో రేయింబవళ్లు పని చేస్తూ, భవన నిర్మాణ రంగ కార్మికుల కంటే ఎక్కువగా వెట్టి చాకిరి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు జర్నలిస్టులను ఆదుకుంటామని ప్రకటనలకే పరిమితమయ్యాయని, కానీ తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.

చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి పేర్ని నాని