రాష్ట్రీయం

దుర్గగుడిలో వరుణ జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జూన్ 20: తీవ్రంగా ఉన్న ఎండలు తగ్గి సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన శ్రీ మల్లేశ్వరస్వామివార్లకు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించటానికి దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ సకల ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా గురువారం ఉదయం 8గంటలకు దుర్గాఘాట్‌లో దుర్గగుడి వేదపాఠశాల విద్యార్థులు, వేద పండితులు, అత్యంత భక్తి శ్రద్ధలతో వరుణ జపం, తదితర ప్రత్యేక కార్యక్రమాలను నియమనిష్ఠలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విచ్చేయగా, దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ తదితరుల చేత ఆలయ స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గా ప్రసాద్ తదితరులు ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వైదిక కార్యక్రమాలతోపాటు విరాట్ పర్వపారాయణ కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమం సుమారు నాలుగు గంటలపాటు జరిగింది.
చిత్రం...దుర్గాఘాట్‌లో వరుణ జపం చేయిస్తున్న దుర్గగుడి స్థానాచార్యులు, తదితరులు