ఆంధ్రప్రదేశ్‌

ఎంపీల విలీనం అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 21: బీజేపీలో రాజ్యసభ సభ్యుల విలీనం అనైతికమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే వరకు ఉద్యమించాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం దేశం, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలుగుతుందనే అంశం టెలీకాన్ఫరెన్స్‌లో ప్రస్తావనకు వచ్చింది. ప్రజావేదికపై ప్రభుత్వానికి లేఖ రాసినా నిరాకరిస్తూ స్వాధీనం చేసుకోవటాన్ని చంద్రబాబు ఆక్షేపించారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే ఎంపీలు పార్టీని వీడారు
ఇలాఉంటే చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ అనంతరం ముఖ్యనేతలు ఉండవల్లి నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఎంపీలు పార్టీని వీడి వెళ్లారని టీడీపీని బీజేపీలో విలీనం చేయటం చట్టప్రకారం చెల్లదని నేతలు స్పష్టం చేశారు. ఈ చర్య కచ్చితంగా ఫిరాయింపుల కిందకే వస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ బనాయిస్తున్న కేసులకు భయపడి పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేసేంత వరకు ఉద్యమించాలని తీర్మానించారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించామని, మిగిలిన జిల్లాల్లో కూడా రెండు, మూడు రోజుల్లో సమావేశాలు నిర్వహించి తాజా పరిణాలపై జిల్లా స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. టీడీపీలోని కొందరు ముఖ్యనాయకులను అధికార వైకాపా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించే ప్రయత్నాలు చేస్తోందని సమావేశం ఖండించింది. పార్టీ నాయకులకు అండగా నిలవాలని నిర్ణయించింది. టీడీపీ నాయకులకు భద్రత తొలగించి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. త్వరలో డీజీపీని కలసి ఈ అంశాలను వివరించాలని నిశ్చయించారు. ప్రజా వేదిక వివాదంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ అధినేత, ప్రస్తుత ప్రతిపక్షనేత, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, వ్యక్తిగత సామగ్రి కూడా బయటకు తీసుకువెళ్లే అవకాశం ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదని సమావేశం గర్హించింది. ప్రజావేదికపై ఇప్పటికే చంద్రబాబు లేఖ రాశారని, దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా స్వాధీన పరచుకోవటం అమానుషమన్నారు. ఢిల్లీలో కూడా కేంద్రం ఇదేరకమైన వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కావటాన్ని సమావేశం తప్పుపట్టింది. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ జగన్ మూడురోజుల పాటు కర్నూలులో జలదీక్ష చేసిన విషయంతో పాటు కాళేశ్వరం పూర్తయితే పాకిస్థాన్, భారత్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులే ఏపీ, తెలంగాణ మధ్య ఉత్పన్నమవుతాయంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ సమావేశంలో చర్చనీయాంశమైంది. సమావేశంలో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్‌రావు, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, మద్దాళి గిరి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.