ఆంధ్రప్రదేశ్‌

వర్షానికి విరిగిపడ్డ కొండ చరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 21: విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీనృసింహస్వామి దేవస్థానం అధికారుల ప్రణాళికా రాహిత్యం కారణంగా సింహగిరి మెట్ల మార్గం ప్రమాదభరితంగా మారింది. భారీ స్థాయిలో మెట్ల మార్గంలో విస్తరణ పనులు చేయడమే ఒక అనాలోచిత నిర్ణయమని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపధ్యంలో ఎడమ కొండ వైపు కాకుండా కుడి భాగం లోయ వైపు విస్తరణ చేయాలని నిర్ణయించడం పట్ల దేవస్థానం వర్గాలతోపాటు ఇంజనీరింగ్ నిపుణులు ఆక్షేపిస్తుంచారు. ఈ నేపథ్యంలో జేసీబీతో తవ్వకాలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతుండగా గురువారం కురిసిన కొద్దిపాటి వర్షానికే కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సింహగిరి మెట్ల మార్గానికి ప్రమాదం పొంచి ఉందని భక్తులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలమంతా ఊరుకుని వర్షాలు ప్రారంభమవుతున్న నేపధ్యంలో మెట్ల విస్తరణ కోసం కొండ చరియలను దొలిచే పనులు చేపట్టారు. మెట్ల మార్గంలో పనులు జరుగుతున్నాయి. గురువారం రాత్రి తేలికపాటి వర్షాలకు ఇప్పటికే తవ్వేసి ఉంచిన చరియలు మెట్ల మార్గంలోకి దొర్లుకుంటూ వచ్చాయి. మార్గ మధ్యలో ఉన్న ఆంజనేయస్వామివారి దేవాలయంపై రాళ్లు విరిగిపడ్డాయి. భారీ బండలు, చెత్తాచెదారాలు, మట్టి మెట్ల మార్గంలో పేరుకుపోయాయి. శుక్రవారం దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లీశ్వరరావు నేతృత్యంలో ఇంజినీరింగ్ సిబ్బంది మెట్ల మార్గాన్ని పరిశీలించి దేవాలయం ముందు, మెట్లపైన జారి పడ్డ మట్టిని రాళ్లను కూలీలతో తొలగిస్తున్నారు.