ఆంధ్రప్రదేశ్‌

రుతుపవనాల ఆగమనంతో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: నైరుతి రుతుపవనాలు రాష్టమ్రంతటా విస్తరించాయి. ఉత్తరాంధ్ర సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నుంచి ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. ఇది పూర్తిగా భూ ఉపరితలంపై నైరుతి వైపు ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.