బిజినెస్

నవరత్నాలకే ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని గాటన పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. వచ్చేనెల పదో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నందున శాఖల వారీ కేటాయింపులపై సమీక్ష జరిపారు. నీటిపారుదల శాఖలో దుబారాను తగ్గించటంతో పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాల అమలుకు నిధుల మంజూరుపై అధికారులతో చర్చించారు. ఆదాయ మార్గాలను అనే్వషిస్తూ నవరత్నాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, మైనింగ్, మద్యం అమ్మకాల్లో నూతన విధానాలను అవలంబించటం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అంశాలపై ఆరా తీశారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ప్రతిపాదనలపై సమగ్ర నివేదిక అందించామని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

చిత్రం...ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి