ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక ప్రాజెక్టులపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 22: రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో చేపట్టిన పలు పర్యాటక ప్రాజెక్టులపై ప్రభుత్వం నిశిత పరిశీలన జరుపుతోంది. గత ప్రభుత్వం చేపట్టిన పలు పర్యాటక ఒప్పందాలను చేసుకున్న సంగతి విదితమే. వీటిలో కొన్ని పూర్తయ్యే దశలో ఉండగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రాజమహేంద్రవరంలో మంజీర హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒక పర్యాటక ప్రాజెక్టు ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకుంది. కనె్వన్షన్ సెంటర్, మల్టీఫ్లెక్స్ షాపింగ్ మాల్, త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి 6 ఎకరాల భూమి కేటాయించింది. రూ.120 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కనె్వన్షన్ సెంటర్, మల్టీఫ్లెక్సు షాపింగ్ మాల్, 80 రూమ్‌లు కలిగిన త్రీ స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. సెంట్రల్ జైలుకు సంబంధించిన భూమిని ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. రాష్ట్ర పర్యాటక కార్పారేషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. కనె్వన్షన్ సెంటర్ నిర్మాణం ఫినిషింగ్ స్టేజ్‌లో వుంది. త్రీ స్టార్ హోటల్, మల్టీఫ్లెక్స్ షాపింగ్ మాల్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇదిలావుండగా జిల్లాలో గత ప్రభుత్వం చేసుకున్న పర్యాటక ఒప్పందాలను ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అనేక పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆరా తీస్తోంది. ప్రధానంగా గత పుష్కరాల సమయంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు చేపట్టారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు పర్యాటక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే గత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర, అటు కేంద్ర నిధులతో కలిపి సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టులకు కేటాయించింది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకలంక పర్యాటక కేంద్రాన్ని రూపొందించారు. ఈ కేంద్రాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించడానికి టెండర్లు పిలిచినా ఆశాజనకమైన రీతిలో స్పందన రాకపోవడంతో ప్రాజెక్టు మందగమనంలో వుంది. దీనితోపాటు పలు ప్రాచీన ఆలయాలను కలుపుతూని పర్యాటక సర్య్కూట్లను రూపొందించారు. రూ.95 లక్షల అంచనా వ్యయంతో సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద రెండు ఉడెన్ కాటేజీలు, 20 రూమ్‌ల సామర్ధ్యం కలిగిన డార్మిటరీలు నిర్మించనున్నారు. రూ.2.14 కోట్ల అంచనా వ్యయంతో కోటిపల్లి వద్ద పర్యాటక ప్రాజెక్టు చేపట్టారు. ఇక్కడ కెఫెటేరియా, వాష్‌రూమ్స్, కాంక్రీటు రోడ్లు, ల్యాండ్ స్కేపింగ్ చేపట్టనున్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టును సుమారు రూ. 69.82 కోట్లతో చేపట్టారు. కాకినాడ బీచ్ ఫ్రంట్, హోప్ ఐలాండ్, కోరింగ వైల్డ్ లైఫ్ శాంచ్యురీ, ఓడలరేవు, ఆదుర్రు, ఎస్ యానాం, కోటిపల్లి ప్రాజెక్టులను చేపట్టారు. కోరింగ వైల్డ్ లైఫ్ శాంచ్యురీ ప్రాజెక్టును ప్రత్యేకించి రూ.8.46 కోట్లతో చేపట్టారు. ఏడు ఆడియో విజువల్ రూమ్స్, లాంగ్ హట్స్, కెఫెటేరియా, ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్, అప్రోచ్ రోడ్డు, పాత్ వే, ఎకో షాపింగ్ రూమ్, వౌలిక సదుపాయాలు కల్పించారు. రూ.2.68 కోట్లతో పాశర్లపూడి వద్ద గోదావరి తీరంలో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆదుర్రు బౌద్ధారామం వద్ద రూ.5.08 కోట్లతో పర్యాటక సదుపాయాలతో ప్రాజెక్టు చేపట్టారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పరిశీలన చేపట్టింది.