ఆంధ్రప్రదేశ్‌

గ్రామ వలంటీర్ల పోస్టులకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా గ్రామ పంచాయతీల్లో గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూలై ఐదో తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. మహిళలు, ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్ ఉత్తీర్ణులై, 18 - 35 మధ్య వయస్సు వారు అర్హులు. ఎంపిక కోసం మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టు 1న ఎంపికైన వారి జాబితా వెల్లడిస్తారు. ఎంపికైన వారికి 5-10 తేదీల మధ్య శిక్షణ ఇస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు విధుల్లోకి తీసుకుంటారు. వలంటీర్లుగా ఎంపికైన వారి పని తీరు ఆధారంగా నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం లభిస్తుంది. ఇక వలంటీర్లుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 గృహాల వద్దకు తరుచూ వెళుతూ ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించి, ఆ సమాచారాన్ని గ్రామ సచివాలయానికి అందించాల్సి ఉంది.
ఆయా కుటుంబాల నుంచి వచ్చే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలి. ఆయా కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా విద్యా, ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కల్గిస్తూ వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి. రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పని చేయాల్సి ఉంది. ఇలా ఉండగా అప్పుడే గ్రామాల్లో ఉద్యోగాల కోసం సందడి ఆరంభమైంది.