ఆంధ్రప్రదేశ్‌

కాళేశ్వరంపై మాట తప్పిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్‌ను తెలంగాణాకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాకట్టు పెట్టి గోదావరిపై కాళేశ్వరం అక్రమ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి హాజరవ్వడం శోచనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎగువ రాష్టమ్రైన తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల మీద నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి, దిండి తదితర ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల వల్ల దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌కు నీరు లభించక ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను రోడ్డున పడవేయవద్దని, ఐదు కోట్ల ఆంధ్రప్రజల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందంటూ 2016వ సంవత్సరం మే 16, 17, 18 తేదీల్లో కర్నూలులో నిర్వహించిన జలదీక్షలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ శాపనార్థాలు పెట్టారన్నారు. మాట తప్పను - మడమ తిప్పను అని జగన్ పదేపదే చెబుతుంటారు, అయితే నేడు మాట తప్పి అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నాయకుడు అన్న తర్వాత విశ్వసనీయత ఉండాలన్నారు.