ఆంధ్రప్రదేశ్‌

మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యుల పదవులు భర్తీ చేయాలని, అలాగే లోకాయుక్త చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శనివారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మానవ హక్కుల ప్రాధాన్యత గుర్తించి దేశంలో మానవ హక్కుల చట్టం ద్వారా జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేశారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యుల నియామకం లేదని, ఫలితంగా ఖాళీగా ఉన్నాయని, మానవ హక్కుల అతిక్రమణ జరిగిన అనేక అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. 2013లో వచ్చిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టం సెక్షన్ 63 ప్రకారం ప్రతి రాష్ట్రంలోను ఒక లోకాయుక్త ఉండాలని, ఈ చట్టం వచ్చేనాటికే ఆ రాష్ట్రంలో లోకాయుక్త సంస్థ లేకపోతే ఈ చట్టం వచ్చిన సంవత్సరం లోపు ఏర్పాటు చేయాలని, గత చైర్మన్ రిటైరైన తరువాత మళ్లీ నియామకాలకు చర్యలు తీసుకోనందున వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త తదితర స్థానాలకు వెంటనే నియామకాలు చేపట్టాలని మధు కోరారు.