ఆంధ్రప్రదేశ్‌

బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలనే అమ్మ ఒడి సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 22: బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించి పిల్లలను విద్యా మార్గం వైపు నడపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో ప్రకటించిన అమ్మ ఒడి సంకల్పమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయలం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన అమ్మ ఒడి, ఫీజు రియింబర్స్‌మెంట్ హామీలను కచ్చితంగా నెరవేర్చేదిశగా చర్యలు షురూ అయ్యాయన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు గొప్ప విద్యావంతులు కావాలన్నారు. ఆర్థిక స్థోమత లేకనో మరో ఇతర కారణాలతోనో పిల్లలు విద్యకు దూరమై బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే అమ్మ ఒడి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారన్నారు. విద్యాహక్కుకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేసే విషయమై అధ్యయనం చేస్తున్నామని, దీనిపై ఎవరైనా సలహాలిస్తే పరిశీలిస్తామన్నారు.