ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి కలసిరాని రాజ్యసభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కూడా పెద్దల సభ కలసిరావడం లేదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 1984లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాష్ట్ర శాసనమండలిని రద్దు చేశారు.
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మండలిని తిరిగి పునరుద్ధరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అధికారంలో లేనప్పటికీ శాసనమండలిలో మంత్రి కీలక పాత్ర వహించనుంది. అయితే కేంద్రం విషయానికి వస్తే రాజ్యసభలో మాత్రం టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఆరేళ్ల పాటు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా అన్నింటా లబ్ధిపొందిన వారిలో రావుల చంద్రశేఖరరెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు మినహా మిగిలిన వారు కడవరకు పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవు. అత్యంత కీలకమైన రాజ్యసభలో టీడీపీ పక్ష నేతలుగా పనిచేసిన వారు సైతం పార్టీకి మిగలలేదు. తాజాగా సుజనా చౌదరి పార్టీ ఫిరాయింపుతో ఆ సంప్రదాయం కొనసాగినట్లయింది. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర, జయప్రద, తులసిరెడ్డి, మైసూరారెడ్డి, రామమునిరెడ్డి, సీ రామచంద్రయ్య, రేణుకా చౌదరి పార్టీకి దూరమయ్యారు. తాజాగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు అదేదారిలో నడిచారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలుగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రేణుకా చౌదరి, మందా జగన్నాథం, నామా నాగేశ్వరరావు కూడా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. అయితే దగ్గుబాటి తొలుత తెలుగుదేశంలో కీలక పాత్రధారి అయినప్పటికీ ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున గెలిచి, ఆపై బీజేపీ అనుబంధ సభ్యునిగా కొనసాగారు. ఎర్రన్నాయుడు పార్టీలో ఉంటూనే మృతి చెందగా, తాజాగా సుజనా చౌదరి పార్టీ మారారు. ప్రస్తుతం కనకమేడల రవీంద్రకుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులుగా కొనసాగుతున్నారు.