ఆంధ్రప్రదేశ్‌

నేడు జనసేన కీలక కమిటీల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతయిందన్న ప్రచారానికి తావులేకుండా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. దీనిలోభాగంగా పార్టీ బలోపేతానికి పలు కీలక కమిటీలను సోమవారం విజయవాడలో ప్రకటించబోతున్నారని తెలిసింది. ఆదివారం విజయవాడ చేరుకున్న పవన్‌కళ్యాణ్ ఈవిషయమై పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు బీజేపీలో చేరిపోయారు. అదే బాటలో మరికొందరు నడవకుండా కట్టడి చేసే ప్రయత్నంలో పవన్‌కళ్యాణ్ ఉన్నారు. కొత్తతరం రాజకీయ వ్యవస్థ రూపకల్పన, పాలకుల్లో జవాబుదారీతనం పెంపొందించడం, సమసమాజ నిర్మాణం, యువతరానికి పాతికేళ్ల భవిష్యత్‌ను అందించడం కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్‌కళ్యాణ్ తరచూ చెబుతుండేవారు. ఆ దిశగా మరింత బలంగా రాజకీయాలు నెరపడం కోసమే ముఖ్యమైన కమిటీలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే జిల్లాలవారీ సమీక్షలు విజయవంతంగా ముగిశాయి. దీంతో దిగువ స్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశే్లషించి నూతన కమిటీలకు రూపమివ్వబోతున్నారు. వర్తమాన రాజకీయాలు, ప్రజాసంక్షేమం, రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్ వ్యూహాలను రచిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాజకీయాలు నెరపుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు దృఢమైన పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ఆపై గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలన్న కృతనిశ్చయంతో పవన్‌కళ్యాణ్ ఉన్నారు. తక్షణం పొలిటికల్ అఫైర్స్ కమిటీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మానిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మానిటరింగ్ కమిటీ వంటి ముఖ్యమైన కమిటీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.