ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: చాలా కాలంగా బదీలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు పచ్చజెండా ఊపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే చోట వివిధ హోదాల్లో పని చేసిన సర్వీసును కలిపి బదిలీకి మదింపు చేయనున్నారు.
40 శాతం అంతకన్నా ఎక్కువ అంగ వైకల్యం, మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న వారికి, ఆరోగ్య కారణాలు, స్పౌజ్ కేసులకు సంబంధించి ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో రెండు కన్నా ఎక్కువ సంవత్సరాలు పని చేసిన వారికి కొన్ని నిబంధనలకు లోబడి వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీకి అవకాశం కల్పించింది. వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్, రవాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ శాఖలకు తమదైన బదిలీ ప్రక్రియ ఉన్నప్పటికీ, ఈ సమయంలోనే బదిలీల ప్రక్రియను ఆయా శాఖలు ముగించాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల పరిధిలో పని చేస్తున్న విద్యా విభాగానికి చెందిన ఉద్యోగులకు ఈ బదిలీల ప్రక్రియ వర్తించదు. వచ్చే మార్చి 31న పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరు.