ఆంధ్రప్రదేశ్‌

ప్రజావేదిక వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో వేదిక కూల్చివేతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో సమావేశమైన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న తదితరులు ప్రజావేదిక వద్ద నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నివాసం నుంచి ప్రజావేదిక మీదుగా నేరుగా వెళ్లేందుకు పోలీసులు టీడీపీ నేతలను అనుమతించలేదు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును కూడా ఒకానొక దశలో పోలీసులు నిలువరించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజావేదిక- చంద్రబాబు నివాసాల మధ్య రాకపోకలను నియంత్రించి కట్టుదిట్టం చేశారు. దీంతో వెనుకవైపు మార్గంలో టీడీపీ నేతలు వెళ్లాల్సి వచ్చింది. ప్రజావేదికను నిబంధనల మేరకే నిర్మించారని దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించక పోగా కూల్చివేతకు ఆదేశాలు జారీచేయటం అన్యాయమని టీడీపీ నేతలు వాదించారు. ఇదిలా ఉండగా కృష్ణానదీ కరకట్ట మార్గంలో చంద్రబాబు నివాసంతో సహా అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ద్వారా టీడీపీ అధినేతకు సంకేతాలు పంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కరకట్ట దిగువన నిర్మించిన కట్టడాలన్నీ అక్రమమైనవిగానే రివర్ కన్జర్వేషన్ బోర్డు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో కొన్నింటిపై కోర్టు కేసులు నడుస్తున్నందున కూల్చివేతకు అధికారులు సాహసించటంలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కరకట్ట తీరాన నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించింది. చంద్రబాబు నివాసం అదే ప్రాంతంలో ఉన్నందున కొన్నింటిని క్రమబద్ధీకరించారు. వైకాపా ప్రభుత్వం కూడా అదే తరహాలో నదీతీరాన అక్రమ కట్టడాలపై గురిపెట్టింది.