ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రిపై సహస్ర ఘటాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూన్ 24: సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణయాగం సోమవారం సహస్ర ఘటాభిషేకంతో ఘనంగా ముగిసింది. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో కొలువై ఉన్న పరమేశ్వరునికి సోమవారం ఉదయం అర్చకులు అత్యింత భక్తి శ్రద్ధలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ మహోత్సవాలకు సంబంధించి ఈనెల 20వ తేదీన ప్రత్యేక వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు. ముగింపుగా సోమవారం ఉదయం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో శివాలయం ప్రధాన అర్చకుడు మల్లయ్య శాస్ర్తీ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ, ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ చేత దుర్గాఘాట్‌లో వివిధ రకాలైన ప్రత్యేక పూజలు చేయించి అనంతరం ఘటాలకు సైతం ప్రత్యేక పూజలను చేయించారు. అనంతరం వేదపాఠశాల విద్యార్ధులు, వేదపండితులు, తదితరులు ఈ ఘటాలతో పవిత్ర జలాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. సహస్ర ఘటాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
చిత్రం...సహస్ర ఘటాలతో కృష్ణా జలాలను తీసుకొస్తున్న దృశ్యం