ఆంధ్రప్రదేశ్‌

కుంభకోణాల సంగతి తేలాకే...రాజధాని అభివృద్ధిపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: అమరావతిలో కుంభకోణాల వివరాలు తేలాకే రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం మూడు గంటలు సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణం, రైతుల నుంచి భూసమీకరణ, స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆ వివరాలను మీడియాకు బొత్స వివరించారు.
సీఆర్‌డీఏ చేపట్టిన ప్రతి పనిలో అవినీతి కనిపిస్తోందన్నారు. భూ సమీకరణ, రాజధానిలో జరుగుతున్న పనులు, కాంట్రాక్టుల కేటాయింపు, రైతులకు భూముల కేటాయింపు.. ఇలా ఏ అంశంలో చూసినా అంతులేని అవినీతి కనిపిస్తోందని ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇంకా లోతుగా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రైతులు, ప్రభుత్వం, ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని సీఎం నిర్దేశించారన్నారు. ఎక్కడా అవినీతికి వత్తాసు పలుకవద్దని, అవినీతిని అసలు ప్రోత్సహించవద్దని చెప్పారన్నారు. ఇప్పటికే రాజధాని పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇంకొంత సమయం తీసుకుని ఇప్పటి వరకూ జరిగిన రాజధాని నిర్మాణ వ్యవహారాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారని తెలిపారు.
కొన్ని సూచనలు కూడా చేశారన్నారు. అవినీతి సంగతి తేలాకే రాజధాని నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు.
బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. 100 రూపాయలతో అయ్యే పనికి 150 రూపాయలు ఖర్చు చేశారన్నారు. భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం అవినీతి కూపంగా మారిందని విమర్శించారు. తమకు కావాల్సిన వాళ్లకు అనుకూలంగా, పేద వాళ్లకు ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారన్నారు.
త్వరలో మరోసారి సీఆర్‌డీఏపై సమీక్ష ఉంటుందని, అప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమ నిర్మాణం కనుకనే ప్రజావేదికను కూల్చివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వ్యవహారాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
చిత్రం...సీఆర్‌డీఏపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి