ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 26: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోకి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు చేరుతున్నారని, నిజాయితీగా అంకితభావంతో పనిచేసే వారికి బీజేపీ కచ్చితంగా సరైన వేదికగా వర్ణించారు. బుధవారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అత్యంత బలమైన పార్టీగా తయారవుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయని, ఇది రాష్ట్రానికి శుభసూచికమని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఒక్క బీజేపీయే అవుతుందనేది అక్షర సత్యమని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్, జనసేన నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలీయమైన శక్తిగా రూపాంతరం చెందనుందంటూ మరికొద్ది రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. సభ్యత్వ నమోదును గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహించనున్నామని, కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పనిచేసి, ఇంటింటికీ బీజేపీని చేరువ చేయాలని కన్నా పిలుపునిచ్చారు. కాగా పార్టీలో చేరిన వారిలో టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు టివి రావు, దుగ్గిరాల మార్కెట్‌యార్డు చైర్మన్ కేశంనేని శ్రీ్ధర్, మంగళగిరి మండలానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
చిత్రం... పార్టీలో చేరిన వారితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ