ఆంధ్రప్రదేశ్‌

హైదరాబాద్ పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకిపురం, మార్చి 24 : సంబంధం లేని కేసులో విచారణ, అంతకుమించి పోలీసులు పదేపదే ఒత్తిళ్లు తీసుకురావడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఓ నిందితుడి విషయమై వాల్మీకిపురానికి వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో గతంలో పనిచేస్తున్న ఎం శివరాజ్‌కుమార్‌పై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫోర్జరీ, మహిళలను వేధించడానికి సంబంధించి నిందితుడైన శివరాజ్‌కుమార్ ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు ఆరా తీశారు. వాల్మీకిపురం మండలం చింతపర్తి చిరునామాగా గుర్తించారు. నిందితుడైన శివరాజ్‌కుమార్ మొదట్లో చింతపర్తిలో నివాసం ఉన్నాడని, ప్రస్తుతం అక్కడ లేడని స్థానికులు పోలీసులకు తెలిపారు. స్నేహితుల గురించి ఆరాతీయగా వాల్మీకిపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ స్వీట్ దుకాణం నిర్వహిస్తున్న రమానాథం (26) నిందితునికి స్నేహితునిగా గుర్తించిన హైదరాబాద్ పోలీసులు రామనాథం వద్దకు వచ్చి శివరాజ్‌కుమార్ ఆచూకీ తెలపాలని ఒత్తిడి తెచ్చారు. ఈ సందర్భంగా రామనాథం పోలీసులతో మాట్లాడుతూ గతంలో తనకు స్నేహితుడని, ప్రస్తుతం అతనికి నాకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ హైదరాబాద్ పోలీసులు పట్టు వీడకపోవడంతో శివరాజ్‌కుమార్ కోసం రామనాథంను వెంట పెట్టుకొని రాత్రి వరకు మండలంలో గాలించారు. దీంతో రామనాథం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన బంధువులకు జరిగిన విషయం తెలిపి లేని తప్పుకు తనను పోలీసులు వేధిస్తున్నారంటూ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. గురువారం ఉదయం హైదరాబాద్ పోలీసులు తన ఇంటికి వస్తారని భయపడి రామనాథం క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.