ఆంధ్రప్రదేశ్‌

డీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలను డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ) ద్వారా చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న ప్రారంభించాలన్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి జూలై 15 నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని తెలిపారు. అత్యంత పారదర్శకతతో, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నియామక ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో కల్పించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలేనన్న విషయం యువతకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న ఉద్యోగులకు అదనంగా మరో 10 మందికి ఉద్యోగం ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వివిధ అర్హతలు ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని, వారందరినీ ఏ పనైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలన్నారు. రెండేళ్లు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో నియమిస్తామన్నారు. దేశంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. దీనికి మంచినీటి కార్పొరేషన్‌ను నోడల్ ఏజన్సీగా గుర్తించాలన్నారు. ఒక జిల్లాను యూనిట్‌గా తీసుకుని, ఆ జిల్లాలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రానున్న 30 సంవత్సరాల్లో జిల్లాల్లో వివిధ నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి