ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, జూలై 4: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన, అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీకి చెందిన పలువురు ముఖ్యులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
నెల్లూరు జిల్లా కావలి పర్యటన సందర్భంగా గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాల అమలుతీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి ఎక్కువ మెజారిటీతో రెండవసారి బీజేపీకి అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత మెరుగైన పాలన అందించేందుకు విశేష కృషి చేస్తామన్నారు.
టీడీపీ మోసపూరిత వాగ్దానాలకు విసిగిపోయి రాష్ట్రంలో ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని, ప్రస్తుతం ఆ పార్టీ తిరిగి కోలుకోలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు టీడీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఆ పార్టీకి చెందిన ప్రముఖులు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోయిన నావలాంటిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీకే అవకాశమని తెలిపారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రతి కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు భారీగా పార్టీ సభ్యత్వాలకు కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేసి భారీగా పార్టీ సభ్యత్వం నమోదయ్యేలా చూడాలని సూచించారు. ఈనెల 8 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం 12 కోట్లు ఉండగా, అంతకుమించిన సభ్యత్వంతో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించబోతోందని కన్నా తెలిపారు. రాష్ట్రంలో వైకాపా పాలనపై ఆయన మాట్లాడుతూ ఆరునెలల వరకు వేచిచూస్తామని, అనంతరం అప్పటి పరిస్థితినిబట్టి తమ అభిప్రాయం వెల్లడిస్తామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ, జి.్భరత్‌కుమార్, సీనియర్ నాయకులు చలువాది సత్యం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ సీవీసీ సత్యం, మహిళా ప్రతినిధులు అనసూయమ్మ, మాధవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.