ఆంధ్రప్రదేశ్‌

నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 24: ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధి సూదికొండ ప్రాంతానికి చెందిన కోతి మహేంద్ర (11), వడ్ల కార్తీక్ (10) జయరామచంద్రపురంలోని కీర్తిసాగరంలో గురువారం మునిగి మృతి చెందినట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ సురేషు తెలిపారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల విడిచిపెట్టిన అనంతరం ఈ నీటికుంటలో దిగిన చిన్నారులు నీటి ఊబిలో ఇరుక్కొని మృత్యువాతపడ్డారు. మృతులతోపాటు మరో ఇద్దరు స్నేహితులు వెళ్లినప్పటికీ మొదట స్నానం చేసేందుకు కార్తిక్, మహేంద్ర దిగారు. నీటిలో దిగిన ఇద్దరు ఎంతకీ పైకి రాకపోవడంతో ఒడ్డున వున్న స్నేహితులు సమీపంలో పనులు చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి రక్షించాలని ప్రాథయే పడడంతో వారు వచ్చి బయటకు తీసినప్పటికే వారు విగతజీవులుగా మారారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బాలికపై అత్యాచారం..
కీచకుడిపై కేసు నమోదు
బొబ్బిలి, మార్చి 24: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కీచకుడి వైనం ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి ఎస్‌ఐ రవీంద్రరాజు గురువారం అందించిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలస కాలనీలో ఉంటున్న ముద్దాడ విజయకుమార్, అదే కాలనీలోని ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు కె.సత్యనారాయణ, వెంకటలక్ష్మి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న విజయ్‌కుమార్ ఆ బాలికను ఇంటిలోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే జరిగింది తెలియక ఆ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆదివారం నుంచి ఆ బాలిక పరిస్థితి ఆందోళనగా మారడంతో తండ్రి సత్యనారాయణ కూతుర్ని పరిపరివిధాలుగా అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి నుంచి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బాలిక తండ్రి సత్యనారాయణ ప్రయత్నం చేయగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిదుల ప్రమేయంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఐద్వా కార్యదర్శి ఇందిర రంగప్రవేశం చేసి మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని తల్లిదండ్రులతోపాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి గురువారం ఫిర్యాదు చేసింది. ఈలోగా పెయింటర్ పని చేస్తున్న విజయకుమార్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు.