ఆంధ్రప్రదేశ్‌

అటవీ హక్కుల పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: అటవీ హక్కుల చట్టం- 2006 ప్రకారం ఆయా భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అటవీ భూముల హక్కు చట్టం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎల్వీ మాట్లాడుతూ ఈ చట్టం కిందకు వచ్చే భూముల వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ చట్టం కింద గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూముల వివరాలు కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంకె మీనా మాట్లాడుతూ గిరిజనుల స్వాధీనంలో ఉన్న భూములకు సంబంధించి 1.74 లక్షల క్లెయిమ్‌లు రాగా, ఇప్పటికే 93 వేల క్లెయిమ్‌లకు టైటిల్స్ పంపిణీ చేశామన్నారు. మరో 66,159 క్లెయిమ్‌లు స్పీకింగ్ ఆర్డర్ల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో 15 వేల క్లెయిమ్‌లు రెగ్యులర్ కమిటీల క్లెయిమ్‌లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.