ఆంధ్రప్రదేశ్‌

శనగ రైతులకు శుభవార్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలోని శనగ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెట్ రేటుకు అదనంగా క్వింటాల్‌కు 1500 రూపాయలు చొప్పున చెల్లించేందుకు నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో ధర అంత లాభదాయకంగా లేకపోవడంతో శనగ రైతులు తమ ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీల్లో, గోదాముల్లో నిల్వ చేశారు. రెండు సంవత్సరాలుగా గోదాముల్లో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల మేర శనగ మగ్గుతోంది. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 5000 ధర పలుకుతున్నప్పటికీ, అది కూడా తమ ఉత్పత్తికి తక్కువ ధర అని రైతులు అమ్మకాలు చేయడం లేదు. దీంతో పంట అమ్ముకోలేని పరిస్థితుల వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం రావడంతో సానుకూలంగా స్పందించింది. మార్కెట్ ధరకు అదనంగా క్వింటాల్‌కు 1500 రూపాయలు చెల్లిచేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఒక రైతుకు గరిష్టంగా 30 క్వింటాళ్లు లేదా ఎకరాకు ఆరు క్వింటాళ్ల చొప్పున ఐదు ఎకరాలలో ఏది తక్కువైతే దానికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. వ్యవసాయ మార్కెట్ శాఖ, జిల్లా కలెక్టర్లు తగిన పరిశీలన చేసి చెల్లింపులు చేయాలని ఆదేశించింది.