ఆంధ్రప్రదేశ్‌

నేడు, రేపు 4 మీటర్ల ఎత్తుకు అలలు : ఆర్టీజీఎస్ హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) శుక్రవారం హెచ్చరించింది. సముద్రపు అలలు 2.5 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడతాయని తెలిపింది. గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని, ప్రజలు కూడా తీర ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించింది. అలలు ప్రమాదకరంగా ఉంటాయని తెలిపింది. విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, గాజావాక, పెదగంట్యాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలు, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పొలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాలు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేసింది.