ఆంధ్రప్రదేశ్‌

ఫిజియో థెరపీ వైద్యానికి మంచి భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూలై 5: ఫిజియో థెరపీ వైద్యానికి మంచి భవిష్యత్ ఉందని ఆంధ్రామెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ అన్నారు. శుక్రవారం మిమ్స్ మెడికల్ కళాశాలలో ఫిజియో థెరపీ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిజియో థెరపీ వైద్యరంగంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. శస్తచ్రికిత్సలు, మందుల ద్వారా నయం కాని జబ్బులను ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చన్నారు. కోర్స్ పూర్తి చేసుకుని డిగ్రీలు పొందిన విద్యార్థులు మరింత శిక్షణ పొంది రోగులకు సేవలందించాలని చెప్పారు. ఫిజియో థెరపీ వైద్యంలోఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఫిజియో థెరపీ వైద్యం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని తెలిపారు. వైద్యులు సేవతోకూడిన వైద్యాన్ని అందించాలని, నిబద్ధతతో వృత్తిని చేపట్టాలన్నారు. మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవికుమార్ విద్యార్థులను మంచి వైద్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. డిగ్రీలు పొందిన విద్యార్థులు రోగులకు చక్కటి వైద్యాన్ని అందించి పేరు తెచ్చుకోవాలన్నారు. ఎస్‌ఆర్‌ఈటీ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవికుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడా రంగంలోనూ రాణించారని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి కళాశాలకు పేరు ప్రేఖ్యాతులు తెచ్చారని చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ సుశన్నా రామర్స్, మిమ్స్ సూపరింటెండెంట్ రఘురాం, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.