ఆంధ్రప్రదేశ్‌

కూల్చివేతలు కాదు, పాదయాత్ర హామీలను చూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని పక్కనపెట్టి పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీల అమలు విషయం చూడాలని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారక నిర్మాణం రాజీవ్ స్మతి భవన్ స్థానే సీహారియర్ యుద్ధ విమాన ప్రదర్శన శాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టు విషయంలో దూకుడుగా వెళ్తున్న జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. విశాఖలో రాజీవ్ స్మతి భవన్‌ను శుక్రవారం సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పర్యాటకాకర్షణ చర్యల్లో భాగంగా రాజీవ్ స్మతి భవన్ రూపురేఖలు మార్చి యుద్ధ విమాన మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. దివంగత రాజీవ్ గాంధీ చివరి సారిగా విశాఖ నుంచి బయలుదేరి శ్రీ పెరంబుదురులో ఆత్మాహుతి దాడిలో మరణించారని, ఆయన చివరి మజిలీని విశాఖ ప్రజానీకం కలకాలం గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఆర్కే బీచ్‌లో రాజీవ్ స్మృతి భవన్ నిర్మించారన్నారు. మీ తండ్రి దివంగత రాజశేఖర రెడ్డికి రెండు సార్లు పీసీసీ అధ్యక్షునిగాను, రెండు సార్లు ఏపీ ముఖ్యమంత్రిగాను అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. నీ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో చేసిందని, అందుకు రుణపడి ఉండాలన్నారు. వైఎస్ విగ్రహాలు, ఫొటోలతో ఓట్లు తెచ్చుకున్న జగన్, రాజీవ్ గాంధీ స్మృతులను చెరిపివేయాలను కోవడం దారుణమన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే కాంగ్రెస్ ఎప్పటికైనా పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, సీనియర్ నాయకుడు సోడాదాసు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.