ఆంధ్రప్రదేశ్‌

కష్టం వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 11:రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం వృధాగా మారుతోంది. నెలల తరబడి నిర్వహించిన సమీక్షలు చివరకు పుష్కరాలకు పనికిరాకుండా పోయాయి. అధికారుల అలసత్వం, సమన్వయ లోపంతో పుష్కర పనులు గురువారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయంటే వారి పనితీరు ఏ స్ధాయిలో ఉందో ఊహించవచ్చు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లు మినహా, మిగిలిన ఘాట్ల మెట్లను పరిశీలిస్తే నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీతానగరం ఘాట్లు కొంతవరకూ ఫర్వాలేదు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్ లోపల విచ్చలవిడిగా పెరిగిన గడ్డిని తొలగించి సుందరీకరణ చేయాలని బాబు ఆదేశించినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పవిత్రసంగమం వద్ద ఘాట్ల నిర్మాణం పూర్తి కాలేదు. దుర్గఘాట్, పున్నమి ఘాట్ వద్ద ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పుష్కరాలపై సీఎం చంద్రబాబు నెలరోజులకు ముందునుంచే సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. గత వారం రోజులనుంచయితే రోజూ రాత్రి 11 గంటల వరకూ సమీక్షలు నిర్వహించారు. వాటికి హాజరైన అధికారులు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, పూర్తవుతున్నాయని కథలు చెబుతూవచ్చారు. చివరకు బాబు స్వయంగా పనులు పరిశీలించిన తర్వాత గానీ వారి డొల్లతనమేమిటో బయటపడలేదు. పుష్కర ఏర్పాట్లను సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం కృష్ణా జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు. అయినా పుష్కర ప్రారంభ ముందురోజు వరకూ పనులు చివరి వరకూ పూర్తి కాకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లతో పనులు చేయించడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యారని, నిధులు సకాలంలో విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మిగిలిన శాఖాధిపతులు చెబుతున్నారు. అన్ని పనులు జిల్లా కలెక్టర్‌కు అప్పగించడం వల్ల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని, వారు మరొకరికి ఇచ్చారని, ఈ క్రమంలో నిధుల విడుదల కూడా సమస్యగా మారిందని చెబుతున్నారు. డబ్బులు ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా చాలామంది ముందుకు రాకపోవడానికి మరో కారణమంటున్నారు. ఇదిలాఉండగా, పనుల సమన్వయంపై వస్తున్న ఫిర్యాదులపై సీఎం బాబు స్పందించారు. ఈ విషయంలో ఆయన జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా కలెక్టర్ పనితీరుపై సీఎంఓ అధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రెండేళ్లలో మంత్రులు, ప్రజాప్రతినిధులను కూడా లెక్కచేయకుండా వ్యవహరించి, బాబుతో అనేకసార్లు ప్రశంసలు పొందిన కలెక్టర్ పుష్కరాల ఏర్పాట్లపై మాత్రం బాబు అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో బాబు ఎవరు లేకపోయినా ఇంకొకరిని పెట్టి చేయిస్తానని వ్యాఖ్యానించేంత వరకూ వెళ్లారు. మీడియా ప్రతినిధులు కూడా జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. కావలసిన సమాచారం కోసం ఫోన్ చేస్తే స్పందించటం లేదని వారు మీడియా సమక్షంలోనే ఫిర్యాదు చేశారు.