ఆంధ్రప్రదేశ్‌

రైతు దినోత్సవం హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 8: రాష్ట్రంలో విత్తనాల కొరత ఏర్పడి రైతులు రోడ్డెక్కుతున్నా స్పందించని ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజన్న రాజ్యం తెస్తామని చెప్పి విత్తనాలు అడిగితే లాఠీదెబ్బలు తినిపిస్తున్నారని, రాయలసీమ, డెల్టా, ఉత్తరాంధ్రలో వరి విత్తనాల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం రోజూ చూస్తూనే ఉన్నామన్నారు. సోమవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు ముఖ్యనేతలతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. విత్తనాల సమస్యపై వైసీపీ మంత్రి స్పందిస్తూ విత్తనాల తయారీ అంటే ఇడ్లీ, ఉప్మా తయారు చేసినట్లు కాదని పేర్కొనడం వ్యవసాయం, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికున్న వైఖరిని స్పష్టం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతిని వెతకాలంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారని, లోపాలు చెబితే సన్మానాలు చేస్తామని, రివార్డులు ఇస్తామంటూ బతిమాలుతున్నారన్నారు. ఈ వైఖరి చూస్తే ఇన్నాళ్లూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అర్థవౌతోందని, వారు రాసిన పుస్తకాలన్నీ అబద్ధపు రాతల మూటలని స్పష్టవౌతోందన్నారు. కష్టమైన పనులన్నింటినీ ఇప్పటికే తాము పూర్తి చేశామని, కేవలం పంచుకునే పనులనే నూతన ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎద్దేవా చేశారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ పారదర్శకంగా చేసి రెండు నెలల్లోనే విద్యుత్ కొరతను అధిగమించి మిగులు విద్యుత్ సాధిస్తే, వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు నిండకుండానే విద్యుత్ కోతలపాలు చేశారని మండిపడ్డారు. జగన్ చెప్పే రాజన్న రాజ్యంలో 14లక్షల ఇళ్లు మాయమయ్యాయని, బిల్లులు చెల్లించకుండానే ఇళ్లు కట్టినట్లు చూపి మాయం చేశారని ఆరోపించారు. గతంలో వైఎస్ కట్టిన ఇళ్లు పిచ్చుకగూళ్లని పిలిచేవారని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లకు, వీటికి మధ్య పోలిక తేవటం హాస్యాస్పదమన్నారు. తప్పులన్నీ మీ ఇంట్లో పెట్టుకుని ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం ‘జగన్ అండ్ కో’కే చెల్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. బీమా క్లయిమ్‌లు, సీఎంఆర్‌ఎఫ్ చెల్లింపులు, పెళ్లి, రంజాన్ కానుకలు ఇలా సంక్షేమార్థమైన ఏ ఒక్కటీ ప్రజలకు అందకుండా చేస్తున్న వైసీపీ పాలన చూస్తుంటే ఇది నిలిపివేతల ప్రభుత్వమే తప్ప చెల్లింపుల ప్రభుత్వం కాదనేది 40రోజుల్లోనే తేలిపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. భేటీలో పార్టీ ముఖ్య నేతలు టీడీ జనార్ధన్, ఏఎస్ రామకృష్ణ, అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్, వీవీవీ చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జవహర్, శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు, మాల్యాద్రి, పంచుమర్తి అనూరాధ, సాదినేని యామిని పాల్గొన్నారు.

చిత్రం...టీడీపీ ముఖ్య నేతల భేటీలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు