రాష్ట్రీయం

పొగాకు బోర్డు చైర్మన్‌గా యడ్లపాటి రఘునాథబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 12: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబుకు ఆ పార్టీ అధిష్ఠానం కీలకపదవి కట్టబెట్టింది. ఆయనను పొగాకు బోర్డు చైర్మన్‌గా నియమిస్తూ శుక్రవారం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గత కొంతకాలంగా పొగాకు బోర్డు చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో రఘునాథబాబుతో భర్తీచేశారు. రెండు రోజుల్లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆది నుంచి రఘునాథబాబు, ఆయన సతీమణి యడ్లపాటి స్వరూపరాణి ఇరువురు భారతీయ జనతా పార్టీలో కీలక పదవులు పోషిస్తూ వచ్చారు. కష్టకాలంలోనూ పార్టీ వాణి వినిపిస్తూ ఎప్పటికప్పుడు కార్యకర్తలను సమీకరించుకుంటూ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. 1994లో బీజేపీలో చేరిన రఘునాథబాబు 1995 నుంచి 2000 వరకు, 2003 నుండి 2006 వరకు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా కొనసాగారు.
2000 నుంచి 2003 వరకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక సభ్యుడుగా, 2006 నుండి 2009 వరకు రాష్ట్ర కోశాధికారిగా, 2009 నుండి 2013 వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఎదుగుతూ వచ్చారు. 1996, 1998లో తెనాలి పార్లమెంటు స్థానం నుండి బీజేపీ తరపున పోటీచేశారు. 1999లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. పార్టీ సీనియర్ నేత రఘునాథబాబుకు ఈ పదవి దక్కడం పట్ల పలువురు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.