ఆంధ్రప్రదేశ్‌

అన్నీ అవాస్తవాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 12: కనీస అవగాహన...అనుభవం లేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షాత్తూ శాసనసభనే తప్పదారి పట్టిసున్నారని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి...అవాస్తవాలను శాసనసభలో చెబుతున్నారని, అసెంబ్లీలో జరుగుతున్న అన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్త్తున్నారన్నారు. జరిగిన తప్పను తెలుసుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, పౌరుషం ఉంటే వెంటనే రాజీమానా చేయాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరూ కలిసి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాదిరిగానే జగన్ వాస్తవాలను వక్రీకరించి సభను తప్పదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంలో అనుభవం లేని జగన్ సలహాదారులపై ఆధారపడుతూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. శాసనసభ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరగాలి, ఏ విధంగా నడపాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. అసలు శాసనసభలో ఏమి జరుగుతుందో కూడా తెలియని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని చెప్పారు. గురువారం కరవుపై జరిగిన చర్చను అర్ధంతరంగా ముగించి, అవాస్తవాలను చెప్పారని, ఈ రోజు వాస్తవాలను తెలిపేందుకు చర్చను కొనసాగించేందుకు అనుమతించాలని టీడీపీ కోరితే, గొప్పలు చెప్పుకోవడానికి వాయిదా తీర్మానం ఇచ్చారని సీఎం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అసలు తాము వాయిదా తీర్మానం ఇవ్వకుండానే సీఎం జగన్ అలా ప్రకటించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. సున్నా వడ్డీపై ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం ఇవ్వ లేదని అవుకథ చెబుతూ శాసనసభను అగౌరవపరిచారన్నారు. గురువారం చర్చలో అంశం గుర్తుకు లేకనే సీఎం ఇలా ప్రవర్తించారన్నారు. మడమ తప్పని నాయకుడినని చెప్పుకుంటూ ఉండే జగన్ గురువారం అసెంబ్లీలో చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రికార్డులు తెప్పిస్తాం...రివ్యూ చేస్తాం.. మీ సంగతి చూస్తాం అన్న జగన్ దానికి కట్టుబడి ఉన్నారా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం ఒక్కపైసా కూడా సున్నా వడ్డీ ఇవ్వలేదని జగన్ ఛాలెంజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవ లెక్కలను ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ ముందు ఉంచారని, ఇప్పుడు దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారన్నారు. అసెంబ్లీ సంస్కృతి, సాంప్రదాయలను టీడీపీ గత 37 సంవత్సరాలుగా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉందన్నారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలో తప్పును తెలుసుకుని రాజీనామా అయినా చేయాలి లేక, ఐదు కోట్ల మంది ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాస్తవాలను వక్రీకరించిన ముఖ్యమంత్రి జగన్ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నేతతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలను తూలనాడుతూ, అవమానించే విధంగా నిండు శాసనసభలో మాట్లాడారన్నారు. ఎన్ని తిట్టినా, ఎంతగా అవమానించినా తాము మాత్రం విషయాన్ని పక్కదారి పట్టించబోమన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి.. 150 మంది ఎమ్మెల్యేలు లేస్తే మీరు ఏమవుతారు అంటూ ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. సభలో ఎంత భయపెట్టినా, అవహేళనగా మాట్లాడినా, చులకన చేసినా సరే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటామన్నారు. సున్నా వడ్డీపై ముందు సీఎం జగన్ అవగాహన చేసుకోవాలన్నారు. బ్యాంకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందన్నారు. రుణాల చెల్లింపుకు సంబంధించి ఎంత మంది ఉన్నా వారందరికీ సున్నా వడ్డీ వర్తిస్తుందన్నారు. అసెంబ్లీలో వక్రీకరించి మాట్లాడిన దానికి ఐదు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని, దీనిపై చర్చ జరగాలన్నారు. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎం దీనిపై సమాధానం చెప్పాల్సిందేనన్నారు. సీఎంగా జగన్‌కు ఎంతో గౌరవం ఇస్తున్నామని, అదే గౌరవం ప్రతిపక్షనేతకు ఇవ్వాలన్నారు. కానీ వెటకారంగా మాట్లాడటం, చెయ్యిఎత్తితే చెయ్యి నరికేస్తా అనడం మానుకోవాలన్నారు. కావలంటే వీడియోలను ఒకసారి చూడాలని అచ్చెన్నాయుడు సూచించారు.
చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు