ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ చైర్మన్‌గా ద్రోణంరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 13: రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ (వీఎంఆర్‌ఏ) చైర్మన్‌గా మాజీ శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున విశాఖ నార్త్ నుంచి పోటీచేసిన శ్రీనివాస్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందారు. గెలిస్తే మంత్రి పదవి వచ్చేదనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ కీలకమైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భావించినప్పటికీ ఆయన అంతగా సుముఖత వ్యక్తం చేయలేదని చెప్తున్నారు. ప్రధానంగా తాను ఓ కులానికి పరిమితం కారాదనేది శ్రీనివాస్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఆయన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో విశేష సంబంధాలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా, మరో విడత లోక్‌సభ సభ్యునిగా, రెండు సార్లు శాసనసభ్యుడిగా పని చేశారు. అదే బాటలో తనయుడు శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ తండ్రి అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో తొలి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ తరుపున రెండో సారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పోటీకి దూరమైనప్పటికీ శ్రీనివాస్ పోటీలో నిలిచారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ద్రోణంరాజు కుటుంబ సభ్యులు విధేయులుగా ఉండటంతో శ్రీనివాస్‌కు జగన్ ప్రాధాన్యత కల్పించినట్లు సమాచారం.