ఆంధ్రప్రదేశ్‌

గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 13: వేకువజామునే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం భుజించిన కొద్దిసేపటికే సుమారు 48 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శనివారం కడప జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని చిత్తూరు మార్గంలోని రింగురోడ్డు సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 178 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులు ఉదయం అల్పాహారం(టిఫిన్)లో భాగంగా ఇడ్లీ, చట్నీ తిన్నారు. అలాగే మజ్జిగ తాగిన కొద్దిసేపటికే 48 మంది వాంతులు చేసుకుని నీరసించి కింద పడిపోయారు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే 108 వాహనం ద్వారా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సహదేవయ్య, వైద్యులు మహేశ్వరరాజు చికిత్స చేశారు. అయితే వారిలో 7వ తరగతి చదువుతున్న విష్ణునాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కడప ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న పట్టణ అర్బన్ సీఐ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులురెడ్డి, వైసీపీ, బీజేపీ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మజ్జిగలో బ్లీచింగ్ పౌడర్ కలిపి ఇవ్వడం వల్లనే విరేచనాలు, వాంతులు అయ్యాయని పలువురు విద్యార్థులు వాపోయారు. ఈ సమాచారం అందుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి వైద్యుడు మహేశ్వరరాజుకు ఫోన్ చేసి విషయం తెలుసుకోవడంతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.