ఆంధ్రప్రదేశ్‌

సింహగిరుల్లో భక్తజన ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 15: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆషాడ పౌర్ణమి ఉత్సవంలో భాగంగా చతుర్దశిని పురస్కరించుకుకొని సింహగిరి ప్రదక్షిణ వేడుక సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ధర్మప్రచార రథ ప్రదక్షిణను ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు కుమార్తె, మాన్సాస్ డైరెక్టర్ అదితి గజపతి, ఆర్డీవో తేజ్‌భరత్, దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ 2 వెంకటేశ్వరరావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి రథ ప్రదక్షిణం ప్రారంభించారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, సంప్రదాయ భజనల నడుమ సింహాచలేశుని రథ ప్రదక్షిణం తొలిపావంచా వద్ద ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ తరలిరాగా స్వామివారి రథం పాత అడవివరం, హనుమంతువాక, విశాలాక్షినగర్, అప్పూఘర్, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం మీదుగా జాతీయ రహదారిలో ప్రదక్షిణ చేసుకుంటూ రాత్రి సింహాచలం చేరుకుంది.
అంతకు ముందు భక్తులు ఉదయం నుండే గిరి ప్రదక్షిణ ప్రారంభించేసారు. తొలిపాంచా వద్ద టెంకాయలు కొట్టి, అప్పన్నస్వామికి మొక్కి బృందాలుగా ప్రదక్షిణకు బయలు దేరారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా భక్తులు కాలినడక ప్రదక్షిణ చేసారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి సింహగిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కొంత మంది భక్తులు మధ్యాహ్నమే విశాఖ నగరంలోని సముద్ర తీరానికి చేరుకుని పుణ్యస్నాలు ఆచరించారు. అక్కడ నుండి మళ్లీ బయలుదేరి కాలినడకన మాధవధార చేరుకుని, వేణుగోపాలస్వామి, మాధవస్వామి దర్శనాలు చేసుకుని రాత్రికి సింహాచలం చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం ఉన్నందున భక్తులంతా సోమవారం ప్రదక్షిణ పూర్తి చేసుకుని అప్పన్న దర్శనాలు చేసుకున్నారు. అధికశాతం మంది భక్తులు ఇంకా ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. వీరంతా మంగళవారం ఉదయం సింహగిరికి చేరుకుంటారు. ఎండ కారణంగా ఉదయం సాధారణంగా మొదలైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత అనూహ్యంగా పెరిగిపోయింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కే.రామచంద్రమోహన్ తన సిబ్బందితో, నగరపోలీస్ కమిషనర్ మీనా ఆదేశాల మేరకు డీసీపీ ఉదయ్‌భాస్కర్ పర్యవేక్షణలో ఏసీపీలు దేవప్రసాద్,ప్రవీణ్‌కుమార్‌తో పాటు పోలీస్ యంత్రాంగమంతా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి భక్తులకు సేవలందిచారు. ప్రదక్షిణకు వచ్చిన భక్తులు లక్షలాదిగా కొట్టిన టెంకాయలతో తొలిపావంచా పరిసరాలు నిండిపోయాయి.
ప్రదక్షిణ చేసే భక్తులకు దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు పానీయాలు, అల్పాహారాలు అందించాయి. మంగళవారం స్వామివారికి నాలుగో విడత గంధం సమర్పణ చేయనున్నారు. సింహగిరి ప్రదక్షిణ భక్తుల్లో అధిక సంఖ్యాకులు కూడా మంగళవారమే స్వామివారిని దర్శించుకోనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా గట్టి బందోబస్తుతో సన్నద్ధంగా ఉంది.
చిత్రాలు.. జెండా ఊపి రథ ప్రదక్షిణ ప్రారంభిస్తున్న అదితి గజపతి, ఈవో..
* భక్తజన సందోహంతో ముందుకు సాగుతున్న రథం