ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్‌పై మండలిలో వాడివేడి చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై మంగళవారం శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య వాద ప్రతివాదనలు జరుగగా, ఇరు పక్షాల సభ్యులను చైర్మన్ స్థానంలో ఉన్న డెప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం వారించడం గమనార్హం. తొలుత అధికార పక్ష సభ్యుడు జంగా కృష్ణమూర్తి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ మత గ్రంథాలతో సమానమైన మేనిఫెస్టో హామీలను అమలుచేసే దిశగా అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రూపొందించిన బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఐదేళ్ల పాటు పాలించిన గత టీడీపీ పాలనలో అంకెల గారడి బడ్జెట్‌తో ప్రజలు నష్టపోయారని విమర్శించారు.
అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ బడ్జెట్ అనేది ప్రతి జిల్లాతోపాటు రాజధాని అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వివిధ ప్రాధాన్యత అంశాలకు కొద్ది మొత్తాలలోనే కేటాయింపు జరిపిన అధికార పక్షం అభివృద్ధి ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ సమతుల్యత పాటిస్తేనే సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్న విషయాన్ని మరచి కేవలం సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న వైనంపై అసంతృప్తి తెలిపిన ఆయన అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాలన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ వైకాపా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో గాంధీ సందేశాలు చెప్పారు కానీ అందుకు సంబంధించిన అంశాలకు నిధుల కేటాయింపులో కోతలు విధించిందన్నారు. దశ బాగుంది కాబట్టి ఎన్నికల్లో గెలిచిన వైకాపా, ఇప్పుడు ప్రజల దిశను తిరోగమనం వైపు నడిపిస్తోందన్నారు.
టీడీపీ, వైసీపీ సంవాదం
వైకాపా బడ్జెట్‌పై రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం జరిగిన చర్చలో టీడీపీ, వైసీపీల మధ్య నెలకొన్న సంవాదంపై చిరాకు పడ్డ డెపూటీ స్పీకర్ రెడ్డి సుబ్రమణ్యం ఇరుపక్షాలను వారించారు. ఏదైనా ఉంటే బయట మీడియా పాయింట్‌లో వాదించుకోండంటూ ఇరుపక్షాల వారిని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది.