ఆంధ్రప్రదేశ్‌

భారీగా డీఎస్పీల బదిలీ : 38 మందికి స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 16: రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. విజయవాడతోపాటు సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులను కీలక స్ధానాల్లో నియమిస్తూ ఏపీ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు సిసిఎస్ డిఎస్పీ యు సూర్యనారాయణను కడప జిల్లా ఎస్‌డిపిఓగా, కడప ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ బి విజయ్‌కుమార్‌ను మైదుకూరు ఎస్‌డిపిఓగా, ఏసిబి డిఎస్పీ ఎల్ సుధాకర్‌ను ప్రొద్దుటూరు ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ జి వీర రాఘవరెడ్డిని అనంతపురం ఎస్‌డిపిఓగా, తిరుమల క్రైమ్స్ డిఎస్పీ ఎస్ రమాకాంత్‌ను ధర్మవరం ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ లాల్ అహ్మన్ షేక్‌ను గుంతకల్ ఎస్‌డిపిఓగా, ఏపిఎస్‌పి ఐదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్, డిఎస్పీ ఎస్ వెంకటరావును కదరి ఎస్‌డిపిఓగా, కృష్ణాజిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్-1 డిఎస్పీ వి విజయరావును పుట్టపర్తి ఎస్‌డిపిఓగా, అనంతపురం పోలీసు ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ ఎస్ రామచంద్రారెడ్డిని తాడిపత్రి ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ ఇ.నాగేంద్రుడుని శ్రీకాళహస్తీ ఎస్‌డిపిఓగా బదిలీ చేశారు. అదేవిధంగా నెల్లూరు సిసిఎస్ డిఎస్పీ బి నర్సప్పను తిరుపతి అర్బన్ వెస్ట్ డిఎస్పీగా, సిఐడి డిఎస్పీ ఎం మోహన్‌రావును తిరుపతి అర్బన్ క్రైమ్స్ డిఎస్పీగా నియమించారు. అలాగే సిఐడి డిఎస్పీ సి భాస్కరరెడ్డిని కర్నూలు టౌన్ ఎస్‌డిపిఓగా, తిరుపతి స్పెషల్ బ్రాంచి డిఎస్పీ వి నరసింహారెడ్డిని డోన్ ఎస్‌డిపిఓగా, మదనపల్లి ఎస్‌డిపిఓ ఎం చిదానందరెడ్డిని నంద్యాల ఎస్‌డిపిఓగా, నెల్లూరు స్పెషల్ బ్రాంచి డిఎస్పీ ఎన్ కోటరెడ్డిని నెల్లూరు రూరల్ ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ ఎం భాస్కరరావును ఆత్మకూరు ఎస్‌డిపిఓగా, ఆర్‌ఎస్‌ఏస్‌టిఎఫ్ డిఎస్పీ బి శ్రీ్భవానీ హర్షను గూడూరు ఎస్‌డిపిఓగా, అనంతపురం పిటిసి డిఎస్పీ జె శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు టౌన్ ఎస్‌డిపిఓగా, తాడిపత్రి ఎస్‌డిపిఓ వైజె రామసుబ్బారెడ్డిని చీరాల ఎస్‌డిపిఓగా నియమించారు. అదేవిధంగా విజయవాడ క్రైం ఏసీపీ కె ప్రకాశరావును దర్శి ఎస్‌డిపిఓగా చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ బి రవిచంద్రను కందుకూరు ఎస్‌డిపిఓగా, రాజమండ్రి రైల్వే డిఎస్పీ ఎస్ మనోహర్‌రావును మార్కాపూర్ ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ ఎం వీరరెడ్డిని నర్సారావుపేట ఎస్‌డిపిఓగా, మరో సిఐడి డిఎస్పీ ఆర్ విజయభాస్కరరెడ్డిని సత్తెనపల్లి ఎస్‌డిపిఓగా, విజయవాడ మహిళా పోలీస్టేషన్ డిఎస్పీ కె శ్రీలక్ష్మీని తెనాలి ఎస్‌డిపిఓగా, ప్రకాశం జిల్లా ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ వై శ్రీనివాసరెడ్డిని తుళ్ళూరు ఎస్‌డిపిఓగా బదిలీ చేశారు. ఇక వెయిటింగ్‌లో ఉన్న డి దుర్గాప్రసాద్‌ను గుంటూరు అర్బన్ నార్త్ డిఎస్పీగా, కమాండ్ కంట్రోల్ డిఎస్పీ బి కమలాకర్‌రావును గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీగా, సిఐడి డిఎస్పీ బివి రామారావును గుంటూరు అర్బన్ వెస్ట్ డిఎస్పీగా, గుంటూరు అర్బన్ ట్రాఫిక్ డిఎస్పీ కె సుప్రజను గుంటూరు అర్బన్ ఈస్ట్ డిఎస్పీగా విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ పి నాగరాజరెడ్డిని విజయవాడ సెంట్రల్ ఏసీపీగా, ఏసిబి డిఎస్పీ కె సురేంద్రనాధ్‌రెడ్డిని విజయవాడ ఈస్ట్ ఏసీపీగా, చిత్తూరు మహిళా పోలీస్టేషన్ డిఎస్‌పి ఎండి షరీఫుద్దీన్‌ను విజయవాడ సిటి నార్త్ ఏసీపీగా, కర్నూలు జిల్లా ట్రైనింగ్ సెంటర్ డిఎస్పీ ఎం రమేష్‌రెడ్డిని అవనిగడ్డ ఎస్‌డిపిఓగా, సిఐడి డిఎస్పీ ఎన్ సత్యానందంను గుడివాడ ఎస్‌డిపిఓగా, శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ బి శ్రీనివాసులును నూజివీడు ఎస్‌డిపిఓగా, విజయవాడ సిటి సౌత్ ఏసీపీ జివి రమణమూర్తిని కృష్ణాజిల్లా నందిగామ ఎస్‌డిపిఓగా నియమించారు. ఈమేరకు డీజీపీ దామోదర గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.