ఆంధ్రప్రదేశ్‌

భక్తుల సౌకర్యాలపై రాష్ట్రపతి అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ, అన్నప్రసాదాలు, స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందించారని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకాధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్రపతి టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మెచ్చుకున్నారని వివరించారు. ఆలిండియా టెంపుల్ నెట్‌వర్కింగ్ కమిటీని టీటీడీ ఏర్పాటు చేసి సలహాదారులుగా ఉండాలని, శ్రీ వైష్ణోదేవి ఆలయం, పూరి శ్రీజగన్నాథ ఆలయం తదితర పెద్ద ఆలయాలకు మార్గదర్శనం చేయాలని సూచించారని వెల్లడించారు. టీటీడీ నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి ఇతర ఆలయాల నిర్వాహకులకు చూపాలన్నారు. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.