ఆంధ్రప్రదేశ్‌

వీఐపీ దర్శన రద్దుకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: ప్రతి రోజూ ఉదయం వీవీఐపీలకు టీటీడీ సంఖ్యాశాస్త్రంతో కల్పిస్తున్న దర్శన సౌకర్యాలను రద్దు చేసి ఒకే విధానాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వాలు మారినప్పుడు పాలకులు తమ ప్రణాళికలకు అనుగుణంగా సంస్కరణలు చేపడతారు. అలాగే టీటీడీలో కూడా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధానాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ సోమవారం నుంచి గురువారం వరకు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరిలో వీవీఐపీలకు దర్శనం సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎల్ 1లో అత్యంత ప్రముఖులు, ఎల్ 2లో ప్రముఖులు, ఎల్ 3లో ప్రముఖుల సిఫార్సు ఉత్తరాలు పొందుతున్న భక్తులకు అవకాశం కల్పించారు. అలాగే శుక్ర, శని, ఆదివారాల్లో టీటీడీలోని బ్లూ బుక్ ఆధారంగా ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీవీఐపీలకు మాత్రమే దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈక్రమంలో పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన వై.వి.సుబ్బారెడ్డి తాను ప్రమాణ స్వీకరం చేసిన మరుక్షణమే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు వీవీఐపీలకు ఉదయం కల్పించే దర్శన సౌకర్యాల్లో సంఖ్య పరంగా జరిగిన వర్గీకరణలో కూడా మార్పులు తీసుకురావాలని యోచిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఓ భక్తుడు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. భగవంతుని సన్నిధిలో అధికారులు విచక్షణమైన అధికారం పేరుతో సామాన్య భక్తుల పట్ల వివక్షను చూపుతున్నారని, దీనికి స్వస్తి పలికించేందుకు న్యాయమూర్తులు కల్పించుకోవాలని కోరారు. ఒక విధంగా న్యాయస్థానం కూడా పిటీషనర్ ఆలోచనలను సమర్థించే విధంగా టీటీడీపై ప్రశ్నల వర్షం కురిపించింది. గురువారం ఈ అంశంపై హైకోర్టులో వాదనలు కూడా జరుగనున్నాయి. అయితే హైకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చేలోపే ఈ సంఖ్యాశాస్త్రంతో వీఐపీల దర్శన విధానంలో జరిగిన వర్గీకరణను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి కూడా దర్శన విధానంలో ధర్మ విధానం పాటించడం అవసరమని గట్టిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల వ్యవధిలో ఈ విధానాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.