ఆంధ్రప్రదేశ్‌

రైతుల ఆత్మహత్యలపై చర్చకు టీడీపీ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రైతుల ఆత్మహత్యలపై చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర శాసన మండలిలో పట్టుబట్టారు. రైతు సంక్షేమంతో ముడివడిన ఈ అంశంపై చర్చ జరపాలంటూ పోడియం వద్ద నిలబడి డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలు దీని వల్ల 24 నిమిషాల సేపు స్తంభించాయి. శాసన మండలి చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన తరువాత రైతు ఆత్మహత్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించడంతో దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యులు డొక్కామాణిక్య వరప్రసాద్, జి.శ్రీనివాసులు, శమంతకమణి, సంధ్యారాణి, రాజేంద్రప్రసాద్, దువ్వారపు రామారావు, బుద్దా నాగ జగదీశ్వర రావు, తదితరులు రైతు ఆత్మహత్యలపై చర్చించాలన్నారు. గత 32 రోజుల్లో 37 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇంతటి తీవ్రమైన సమస్యను చర్చించాలని కోరగా, ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించామని, ఇతర పద్ధతుల్లో వస్తే, చర్చకు అనుమతించే వీలు ఉంటుందని చైర్మన్ వివరించారు. దీంతో ఈ అంశంపై చర్చించాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకున్నారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినా ఏదో రచ్చ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వేరే ఫార్మాట్‌లో రమ్మని చెప్పినప్పటికీ, కావాలని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనికన్నా ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ సభ్యుడు డొక్కా జోక్యం చేసుకుని, ఏ ఫార్మాట్ రావాలో చెబితే ఆ విధంగా వస్తామని తెలిపారు. చైర్మన్ స్పందిస్తూ, వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు అనుమతిస్తారని, సభా సమయాన్ని వృథా చేయవద్దని కోరారు. ఎప్పడు చర్చకు సమయం కేటాయిస్తారో చెప్పారని టీడీపీ సభ్యులు కోరగా, చైర్‌కు ఆదేశాలు జారీ చేయవద్దని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ సభ్యులు తమ స్థానాలకు వెళ్లి కూర్చున్నారు.