ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూముల అమ్మకంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: చెన్నైలోని సదావర్తి భూముల అమ్మకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో మంగళవారం సదావర్తి భూముల విక్రయంపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1885 ప్రాంతంలో రాజావాసిరెడ్డి వారసులు అమరావతిలో ఆలయ ధూపదీప నైవేద్యాలు వేద పాఠశాల నిర్వహణ కోసం చెన్నైలో 471 ఎకరాల భూమిని అప్పగించారన్నారు. ఈ భూముల వేలం కోసం తమిళనాడులోని లోకల్ పత్రికల్లో ప్రకటన ఇస్తే గుంటూరులోని చంద్రబాబు బీనామీ మాత్రమే అక్కడకు వెళ్లి వేలం పాటలో పాల్గొన్నారని, ఎకరం భూమి ధర వాస్తవానికి ఆరు కోట్ల రూపాయలు పైనే ఉన్నప్పటికీ రూ. 50 లక్షలు నిర్ణయిస్తూ రూ. 22 లక్షలకే వేలంలో పాడారని, ఆపై ఏదో బతిమిలాడి మరో ఐదు లక్షలు అదనంగా పాడించినట్లు మినిట్స్‌లో పేర్కొన్నారన్నారు. దేవాదాయ శాఖ అధికారిణి భమ్రరాంబ ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం తెప్పించుకుని ఆ భూమి ధర ఎకరా ఆరుకోట్లు ఉందని చెప్పినందుకు ఆమెను బదిలీ చేసారని అన్నారు. దీనిపై తాను కోర్టుకెళ్లగా తనపై ఐటీ దాడులు చేయిస్తానంటూ నారా లోకేష్ బెదిరించాడని అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుతోపాటు ఎన్నికల్లో ఆ భగవంతుడు కూడా తండ్రీకొడుకులకు గట్టిగానే మొట్టికాయలు వేసాడన్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆ భూములకు టైటిల్ డీడ్‌తోపాటు ఎలాంటి డాక్యుమెంట్లు లేవన్నారు. పైగా తమిళనాడు ప్రభుత్వం ఆ భూములు తమవని వాదిస్తూ వచ్చిందని చివరకు ఆ భూములు ఎవరివన్న అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఆ భూముల విలువ ఐదు వేల కోట్లని తొలుత వైకాపా నేతలు ప్రచారం చేశారు.. ఆ తర్వాత రూ. 1300 కోట్లన్నారు.. ప్రస్తుతం నయాపైసా రాలేదు. సత్యదూరమైన మాటలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తప్పుడు సమాచారాన్ని పదేపదే చెబితే వాస్తవం కాబోదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు. వైకాపా సభ్యుడు కే పార్థసారథి మాట్లాడుతూ ఎలాంటి టైటిల్ డీడ్ లేకుండానే 81 ఎకరాల భూమిని వేలం వేయడానికి ఎలా సిద్ధపడ్డారంటూ ప్రశ్నించారు. చివరగా మంత్రి వెలంపల్లి స్పందించి ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నందున సీనియర్ అధికారిచే విచారణ జరిపిస్తామని ప్రకటించారు.