ఆంధ్రప్రదేశ్‌

మంత్రుల నుంచే మహిళలకు రక్షణ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో మంత్రుల నుంచే మహిళలకు రక్షణ లేక పోతే ఎలా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మహిళల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఏమైన చట్టాలు అమలు చేస్తున్నారా అని సభ్యులు జంగా కృష్ణమూర్తి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, గోవింద రెడ్డి ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చినగంజాంలో మహిళ అత్మహత్యపై చర్యలేవని ఆరోపించారు. ఇంటింటికీ కాపలా పెడతామా అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించారని, పౌరుల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ఒక మంత్రి కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆశా కార్యకర్త తెలిపిందని, మంత్రుల నుంచే మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే వార్డు, గ్రామ సచివాలయాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం కల్పించేందుకు శక్తి పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో మహిళ పొరుగువారితో ఉన్న గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి పార్టీ రంగు పులిమే ప్రయత్నం సరికాదన్నారు. మచిలీపట్నం ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం లేఖపై కేసు నమోదు చేశామని, విచారణ తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.