ఆంధ్రప్రదేశ్‌

జగన్ ప్రభుత్వం తప్పు చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూలై 19: విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి నిర్వహిస్తున్న సమీక్షలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తప్పు చేస్తోందని మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో శుక్రవారం చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పీపీఏలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. పీపీఏలకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా సూచనలను చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు.
పలుసార్లు కేంద్రం చెబుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అతి ముఖ్యమైన అంశాలకు సంబంధించి కేంద్రం ఇస్తున్న సూచనలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న ఆదేశాలను పక్కన పెడితే ఆర్టికల్ 257 కింద కేంద్ర ఏ చర్య అయినా తీసుకునే అధికారం ఉందన్నారు. ముఖ్యంగా పీపీఏలకు సంబంధించి కేంద్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు.
సృజన పేరుతో నో బ్యాగ్ డే: మంత్రి సురేష్
ప్రతి నెల మొదటి మూడవ శనివారం సృజన కార్యక్రమం ద్వారా నో బ్యాగ్ డేని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బ్యాగ్‌ల బరువు తగ్గించేదే ప్రధాన అంశంగా కాకుండగా సృజన కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. అసెంబ్లీ సమావేశంల్లో భాగంగా లాబీల్లో మీడియాతో ఆయన శుక్రవారం చిట్‌చాట్ నిర్వహించారు. ఇక క్రమం తప్పకుండా పాఠశాలల్లో మూడవ శనివారం నో బ్యాగ్ డేని సృజన పేరుతో పథకం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సృజన పథకం ప్రధాన ఉద్దేశం బ్యాగ్‌ల బరువు తగ్గింపే కాకుండా, పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గింజే ప్రయత్నం చేస్తామన్నారు. స్కూల్ పిల్లలు ఆ రెండు రోజులు హ్యాపీగా ఉండాలనేది సీఎం జగన్ ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పారు. అలాగే సృజన పథకం ద్వారా పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతీ పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు సృజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విద్య సంవత్సరం క్యాలెండర్‌ను తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
కాపు కార్పొరేషన్ ఎండీ తీరు సరికాదు: మంత్రి శంకరనారాయణ
రాజకీయ పరమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే మంత్రులు తీసుకుంటారే గాని అధికారులు తీసుకునే అవకాశం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ నాగభూషణం ఇటీవల చేసిన ప్రకటనను ఆయన అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ప్రస్తావించారు. కార్పొరేషన్ రుణాలపై విచారణ చేస్తామంటూ ఎండీ నాగభూషణం ప్రకటన చేయడం సరికాదన్నారు. కాపు కార్పొరేషన్ ఎండీ నాగభూషణం తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
ఎండీ నాగభూషణం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. రాజకీయ నేతలు చేసే ప్రకటలను అధికారుల చేయడం సరికాదన్నారు. ఒక అధికారిగా అటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. రాజకీయ నిర్ణయాలు మంత్రులు మాత్రమే తీసుకోవాలన్నారు. కార్పొరేషన్‌లో ఎవరెవరిని తొలగించారని దానిపై ఇంత వరకు తన వద్దకు నివేదిక రాలేదన్నారు. ఆదరణ పధకంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు.