ఆంధ్రప్రదేశ్‌

దేవాలయ భూములను పరిరక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 20: రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం విచ్చేసిన సందర్భంగా ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీకాకుళపు శివరామసుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాకుళపు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ దేవాలయాలకు దాతలు ఇచ్చిన భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా, దాతల లక్ష్యం మేరకు వాటిని నిర్వహిస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ భూముల్లోని అనుమతి లేని కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన సాగిస్తున్నారని అన్నారు. అనుమతి లేని కట్టడాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనుల్లో ఎటువంటి అవినీతి జరిగినా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్ద పెద్ద దేవాలయాల వద్ద భక్తులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు కొత్త కమిటీలను నియమించనున్నామన్నారు. త్వరలో అన్ని దేవాలయాలు ట్రస్ట్ కమిటీలు రానున్నాయన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమనాశ్రయంగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రపంచంలో జనాభాలో రెండో స్థా నంలో ఉన్న మనం 2020 టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో మరిన్ని మెడల్స్ సాధించేందుకు క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నాయకులు పంతం కొండలరావు, ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిలారెడ్డి, నందెపు శ్రీనివాసరావు, నండూరి రమణ, తదితరులు పాల్గొన్నారు.