ఆంధ్రప్రదేశ్‌

కూలిన వాటర్ పంప్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: అలిపిరి నంది సర్కిల్ రోడ్డు మార్గంలోని మునిసిపల్ కార్పొరేషన్ క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ స్టేజ్-6కు అనుసంధానంగా మునిసిపల్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్న వాటర్ పంప్ హౌస్ శనివారం స్లాబ్ వేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రవౌళీశ్వర్‌రెడ్డి, ఇంజినీర్లు, ఇతర పోలీసు అధికారులు హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రుయాకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పంప్ స్టేషన్‌కు అనుసంధానంగా మోటార్‌లను ఉంచేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈక్రమంలో స్లాబ్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్లాబ్ వేస్తున్న సమయంలో అనూహ్యంగా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో స్లాబ్ కింద పనిచేస్తున్న ఆరుగురిలో ఐదుగురు శబ్దం విని పరుగులు తీశారు. ఈక్రమంలో కొయ్యలు, కమ్ములు వారిపై పడి గాయపడ్డారు. అయితే ఒడిశాకు చెందిన వ్యక్తి మాత్రం తప్పించుకునేలోపే స్లాబ్ మొత్తం అతనిపై పడటంతో అతను కూరుకుపోయాడు. పని చేస్తున్న కూలీల్లో ఒకరు కనిపించకపోవడంతో అలిపిరి సీఐ సుబ్బారెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి పిలిపించారు. వారు శిథిలాలను తొలగించి అందులో కూరుకుపోయిన ఒడిశా యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.