ఆంధ్రప్రదేశ్‌

పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 20: శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆక్షేపించారు. శనివారం గుంటూరులోని హిందూకాలేజీ సెంటర్‌లో ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లేందుకు కృష్ణమాదిగ ఉపక్రమించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదని చెప్పి అడ్డుకున్నారు. దీంతో పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చింది. అనంతరం ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కృష్ణమాదిగ మాట్లాడుతూ గుంటూరు నుండి ప్రారంభించిన పాదయాత్రకు అనుమతి నిరాకరించడం ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ పాలనకు నిదర్శనమని, పాలకుల నిర్ణయాలకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని దుయ్యబట్టారు. వాగ్దానాలను నిలుపుకునే విషయంలో సంకల్పాన్ని ప్రదర్శించాలే తప్ప పోలీసులతో పాలన సాగించాలని చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కూ పడుతుందని హెచ్చరించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు గతంలో ఆయన తండ్రి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. శాసనసభ సాక్షిగా మాట్లాడిన మాటలను జగన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఇచ్చిన మాటకు జగన్ కట్టుబడి ఉండాల్సిన అవసరముందని, ఏ నిబంధన ప్రకారం పాదయాత్రకు అనుమతి నిరాకరించారో చెప్పాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతిలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు చేపడతామన్నారు. 30వ తేదీన కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని కృష్ణమాదిగ హెచ్చరించారు.