ఆంధ్రప్రదేశ్‌

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: వివక్షకు ఎటువంటి తావులేదని, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా ప్రతీ ఎమ్మెల్యేకూ రూ.కోటి మేర నిధు లు కేటాయించారని పర్యాటక శా ఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఏయూ గ్రౌండ్స్ లో జెండా పండుగకు చేపడుతు న్న ఏర్పాట్లను శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతం లో ఎపుడూ ఇటువంటి విధానం లేదని, అటువంటిది తొలిసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలతోపాటు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకూ తాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేకించి కోటి రూపాయలు జగన్ ప్రనుత్వం కేటాయించిందన్నారు. అయితే ఈ నిజాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వీటన్నింటినీ మరిచి మాజీ సీఎం చంద్రబాబునాయుడు జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. ఎంతో పెద్ద మనసుతో వివక్షకు తావు లే కుండా ఎమ్మెల్యేలకు వీటిని కేటాయించారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే చంద్రబాబునాయుడు మాదిరి పెద్దమనిషిగా కాదని, పెద్దమనుస్సు కలిగి ఉండాలని, ఇది జగన్‌కు ఉందన్నారు. వైసీపీ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ రావాలని జగన్ సూచించారని, అటువంటిది టీడీపీ అధికారంలో ఉన్నపుడు 23మంది ఎమ్మెల్యేలను ఎటువంటి షరతుల్లేకుండా తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆదర్శంగా నిలిచే విధంగా జగన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాబోయే తరం ఆదర్శంగా తీసుకునే విధంగా జగన్ నిలుస్తారన్నారు. జెండా పండుగను విశాఖలో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించడంపట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.