ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో అధికారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, జూలై 20: పేదరిక నిర్మూలనకు ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలతో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా వి కోట మండల పరిధిలోని నక్కనపల్లిలో కన్నా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతాపార్టీ అని పేర్కొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 11 కోట్ల సభ్యత్వం పూర్తిచేయగా, ఈ ఏడాది 20 కోట్ల సభ్యత్వాన్ని పూర్తిచేసే లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ 130 పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేస్తుంటే, వా టికి రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పేర్లు పెట్టుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శక్తివంతమైన దేశం గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఓటర్లను లక్ష్యంగా కాకుండా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దేశం కో సం పనిచేసే నాయకుడికి తిరిగి ప్రధానిగా ప్రజలు పట్టం కట్టారని అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, వెనుకబడిన వర్గాలకు చట్టబద్ధత, త్రిపుల్ తలాక్ బిల్లు, అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ తుడుచుపెట్టుకు పోయిందని, టీడీపీ కోలుకోలేనంతగా దెబ్బతిందని, అధికార వైసీపీకి కూడా అదే గతి పడుతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. గ్రామస్థాయిలో కార్యకర్తలను సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనేలా చేసి రానున్న ఎన్నికలతో పాటు 2022లో జరిగే జమిలి ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు సమాయత్తం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని, ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కన్నా సమక్షంలో కుప్పం, పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు.