ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం సూచనతోనే.. అమరావతికి ఆర్థిక సాయం ప్రతిపాదన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ప్రతిపాదనను విరమించుకున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. అమరావతికి రుణ మంజూరు అంశంపై ఆదివారం ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో రాజధాని అభివృద్ధికి అమరావతి వౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు కింద 300 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోరింది. ఆర్థిక సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించినా రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో కొంత జాప్యం జరిగింది. వివిధ కారణాల వల్ల రుణం మంజూరు చేయలేదు. నిధుల మంజూరు ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించింది. జూలై 15న కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ అనంతరం రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం నుంచి తప్పుకున్నప్పటికీ ఇతర రంగాల్లో ఏపీ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన, విపత్తు నిర్వహణలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేస్తున్నామని, అది కొనసాగుతుందని తెలిపింది. జూన్ 27న ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు, తదితర సృజనాత్మక పథకాల్లో తామూ భాగస్వాములైనందుకు గర్వంగా ఉందని తెలిపింది. ప్రపంచంలో ఈ తరహా పథకాల అమలుకు మారదర్శకంగా నిలిచినట్లు తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని అన్నిరకాల సహకారం అందించేందుకు సిద్ధమని తాజా ప్రకటనలో ప్రపంచ బ్యాంక్ వివరించింది.