ఆంధ్రప్రదేశ్‌

వలంటీర్ల వ్యవస్థ సరికొత్త రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: విజయవాడ కేంద్రంగా టీడీపీ, అధికార పక్ష వైకాపా నేతలు ఇటీవలి కాలంలో ట్విట్టర్‌లో ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వివాదపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా దీనిలోకి ప్రవేశించారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థపై ట్విట్టర్‌లో వస్తున్న విమర్శలకు ఆయన దీటుగా సమాధానమిచ్చారు. ‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 మంది శాశ్వత ఉద్యోగులు సహా మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. ప్రజల ఆశీర్వాద బలం వల్ల ఇది సాధ్యవౌతోంది’ అని సీఎం జగన్ వివరించారు. ఇక టీడీపీ నేతలను ఉద్దేశించి విజయవాడ లోక్‌సభ వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ ఘాటైన విమర్శలు చేశారు. ‘దురాగతాలు, దౌర్జన్యాలు, దురాక్రమణల్లో వారికెవరూ సరిలేరు. పక్కనోడి ప్లాట్ జాతీయం, పక్కనోడి పొలం జాతీయం, పక్కనోడి ఇల్లు జాతీయం, కొంచెం ముందుగా పుట్టి ఉంటే దివంగత ఇందిరమ్మకే జాతీయం చేయడం ఎలాగో పాఠాలు నేర్పించేవారు’ అంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా హైదరాబాద్‌లో ముగ్గురు ఎంపీలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు భేటీ కావటంపై పీవీపీ ఛలోక్తులు విసిరారు. ‘జోగిజోగీ రాసుకుంటే బూడిద రాలుతుందంటారు. అన్నగారూ.. వెన్నుపోట్లు అవసరం లేదు, జనాలే వేసేశారు. మీ ఆత్మ శాంతించింది. వారందరికీ శాశ్వత విశ్రాంతి లభించింది.. సర్వేజనా సుఖినోభవంతు..’ అంటూ ఆయన ముగించారు.